7 May, 2026 | 6:43 AM

ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయండి

07-05-2026 12:00 AM

ఎంపీ గోడం నగేష్ పిలుపు

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 6 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని హైదరాబాదు పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 10న నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులు ప్రధాని సభ విజయవంతానికి అహర్నిశలు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం. నగేష్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి  అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మే 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించబడే ప్రధాని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిందని, ఇది దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని తెలిపారు.

పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో మొన్న వెలువడిన ఫలితాల్లో కూడా ఘన విజయం సాధించామని, అదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా త్వర లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడవసారి ప్రధాన మంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా హైదరా బాద్‌కు విచ్చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా రాష్ట్రానికి సుమారు 7 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని వస్తున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం సిగ్గు చేటని, దేశంలోని మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు.

తెలంగాణ రైల్వేలకు 95 వేల కోట్ల నిధులు, జాతీయ రహదారులకు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, కేంద్రం నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే విధంగా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేసి, చివరికి ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగ ల్ జిల్లా మాజీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నెంపల్లి పాపన్న , జన్నే మొగిలి, రాష్ట్ర నాయకులు రాయరాకుల మొగిలి, ఆరో వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు,

తాడికొండ రవి కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, వెలిశాల సత్యవతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య, అర్బన్ అధ్యక్షులు గీస సంపత్, మీడియా ఇంచార్జ్ మునెందర్, కార్యాలయ కార్యదర్శి వట్టెం తిరుపతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్, రూరల్ అధ్యక్షుడు రాజు, శాయంపేట మండల అధ్యక్షులు రామకృష్ణ, సీనియర్ నాయకులు శ్రీనివాస్, కొమరన్న, సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.