నాగులవంచలో మొక్కజొన్న రైతుల రాస్తారోకో
22-04-2026 01:26 AM
చింతకాని. ఏప్రిల్ 21. ( విజయ క్రాంతి ) : మొక్కజొన్నలు 26 క్వింటాళ్ళ పరిమితిని ఎత్తివేసి రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ ఖమ్మం - బోనకల్ ప్రధాన రహదారిపై నాగులవంచ లో. వైయస్సార్ విగ్రహం వద్ద చింతకాని మండల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలు ట్రాన్స్పోర్టేషన్ చేసేందుకు సరిపడా లారీలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన పంటను తరలించాలని డిమాండ్ చేశారు. 9గంటల నుండి రైతులు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి. Si వీరేందర్ తో పాటు సొసైటీ. సీఈఓ యాలమూడి శ్రీనివాసరావులు వచ్చి రైతు నాయకుల్ని శాతింపజేయడంతో రాస్తారోకో విరమించారు.






