22 April, 2026 | 3:06 AM

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ భవిష్యత్తుకు గ్యారెంటీ

22-04-2026 01:25 AM

పాల్వంచ, ఏప్రిల్ 21, (విజయక్రాంతి): _కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ భవిష్యత్తు& ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దీమా వ్యక్తం చేశారు. మంగళవారం పాత పాల్వంచ లోని వనమ స్వగృహంలో  కొత్తగూడెం నియోజకవర్గ  పాల్వంచ పట్టణ మండల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై స్పష్టమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టామన్నారు. 

బూత్ స్థాయిలో బలమైన కమిటీల నిర్మాణమే రాబోయే విజయానికి పునాదని  స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి  మాట్లాడుతూ రాబోయేది మళ్లీ కెసిఆరేనని, బీఆర్‌ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి  వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. నా చివరి కోరిక& మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడడమే! అని చెప్పడంతో ఉన్న కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపింది.

ఈ కార్యక్రమంలో  బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్, సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, కనగాల బాలకృష్ణ, మల్లెల రవిచంద్ర, పాల్వంచ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, కాంపెల్లి కనకేష్, పాల్వంచ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు బత్తుల మధుచంద్, సిందూ తపస్వి, గుగులోత్ రాంబాబు, గోవాడ గుణచరిత్, బట్టు మంజుల తదితరులు పాల్గొన్నారు.