17 August, 2026 | 4:00 AM

వధూవరులను ఆశీర్వదించిన సీఎం

17-08-2026 02:36 AM

కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): వధూవరులను సీఎం రేవంత్‌రెడ్డి ఆశీర్వదించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్‌రావు కుమార్తె జ్యో నీట, దాసుల వివాహ విందుకు ఆదివారం హాజరయ్యారు. బిచ్కుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.