కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించిన మాధవానంద సరస్వతి
పీఠాధిపతితో ట్రస్ట్ చైర్మన్ చింతల శంకర్ నేత
కామారెడ్డి, మే 18 (విజయక్రాంతి) :కామారెడ్డి జిల్లాలోని ఈస్సన్నపల్లి, (రామారెడ్డి) లోని కాలభైరవ స్వామి ఆలయానికి పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి దర్శించుకున్నారు. పీఠాధిపతికి కాలభైరవ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చింతల శంకర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పిఠాధిపతి మాధవ నంద సరస్వతి స్వామి కి పట్టు శాలువాతో సన్మానం చేశారు. అనంతరం వారి ఆధ్వర్యంలో జిల్లాలోని బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ సూక్త మహా రుద్ర పారాయణములు భక్తులచే లక్ష పుష్పార్చన కార్యక్రమం ను ప్రారంభించారు,
వేద పఠనం స్వామివారికి అభిషేకం, తదుపరి భక్తులకు, బ్రాహ్మణులకు అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి బూర్ల ప్రభు , డైరెక్టర్లు , దేవస్థాన అర్చకులు శ్రీనివాస్ శర్మ,వంశీ శర్మ,జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆఫీస్ సబార్డినేట్ నాగరాజు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






