10న ఎల్‌ఎల్‌ఎం సీట్ల కేటాయింపు
31-08-2026 12:32 AM
ఎల్‌ఎల్‌బీ కన్వీనర్ కోటాలో 3,624 సీట్లు కేటాయింపు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఎల్‌ఎల్‌ఎం రెండో విడత కౌన్సిలింగ్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు గడువిచ్చారు. సీట్లను అదే నెల 10వ తేదీన కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ నెల 29న ఎల్‌ఎల్‌బీ రెండో విడతలో 4235 కన్వీనర్ కోటా సీట్లలో 3624 సీట్లను కేటాయించారు.






