31 August, 2026 | 4:32 AM

రేపు టీచర్ల చలో హైదరాబాద్

31-08-2026 01:08 AM
  1. పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దుకు డిమాండ్
  2. ఇందిరాపార్క్ వద్ద పీఆర్టీయూటీఎస్ మహాధర్నా

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): పీఆర్సీ ప్రకటన(PRC announcement), సీపీఎస్ (కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం{Contributory Pension Schem})ను రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల(DSC teachers)కు పాత పెన్షన్ అమలు(Old Pension Scheme) చేయాలనే డిమాండ్లతో ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమంలో భాగంగా మంగళ వారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పీఆర్టీ యూ టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో వేలాది మంది ఉపాధ్యాయులతో మహాధర్నా చేపట్టనున్నారు.   

ఇందు కు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను పునరుద్ధరించడంతో పాటు, 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని దశాబ్దాల కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లవుతు న్నా, ప్రభుత్వం ఇప్పటి వరకు రిపోర్టు కూడా తెప్పించుకోలేదని పీఆర్టీయూ టీఎస్ నాయకులు అంటున్నారు.

ఈ సమస్యలు చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని, కాంగ్రెస్ అధికారం లోకి వస్తే డిమాండ్లను నెరవేరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. ప్రభు త్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా హామీలను నెరవేర్చకపోవడంతో ఉద్యమబాట పట్టినట్లు పేర్కొ న్నారు. 

వేలాదిగా తరలిరావాలి : ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న మహా ధర్నాకు ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.