31 August, 2026 | 1:32 AM

‘నీట్’ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

31-08-2026 12:30 AM

మేడ్చల్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): పీర్జాదిగూడలోని సూర్య టెక్నాలజీ, నాగోల్ లోనే సియాస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏర్పాటుచేసిన నీట్ పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలిం చారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్య లు తలెత్తకుండా పగడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి తహసిల్దార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.