అంగట్లో అంగన్‌వాడీ కొలువులు!
- రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రేటు?
- పాల్వంచలో కార్పొరేటర్ బేరసారాల ఆడియో కలకలం
- మంత్రికి బాధిత అభ్యర్థి ఫిర్యాదు
- ఇల్లెందులోనూ మున్సిపల్ కౌన్సిలర్‌పై అధికారులకు ఫిర్యాదు
- దరఖాస్తుదారుల్లో ఆందోళన
- పారదర్శకత పాటించాలని డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు ౩౦ (విజయక్రాంతి): ఎన్నో ఏళ్ల తర్వాత అంగన్‌వాడీ టీచర్లు(Anganwadi teachers), ఆయాల పోస్టుల భర్తీ(Filling of posts)కి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ(Notification issued) చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అర్హత, మెరిట్(Merit) ప్రాతిపదికన పోస్టులు దక్కుతాయని ఆశించిన అభ్యర్థులకు(Candidates) జిల్లాలో చోటుచేసుకుంటు న్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంగన్‌వాడీ పోస్టుల కోసం కొందరు దళారులు, ప్రజాప్రతినిధులు బేరసారాలకు తెర తీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో పోస్టుకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. పాల్వంచలోని 45వ డివిజన్ పరిధిలో అంగన్‌వాడీ పోస్టు విషయంలో కా ర్పొరేటర్ బేరసారాలు చేసినట్లు ఆడియో వెలుగులోకి రావడం, దీనిపై ఓ అభ్యర్థి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదే తరహాలో ఇల్లెందు మున్సిపల్ పరిధిలోనూ అర్హులను పక్కనపెట్టి బం ధువులకు పోస్టు ఇప్పించేందుకు ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నించినట్లు ఫిర్యాదు అందిన ట్లు సమాచారం. అంగన్‌వాడీ పోస్టుల భర్తీ వ్యవహారంలో వరుస ఆరోపణలు, ఫిర్యాదు లు కలకలం రేపుతున్నాయి.
ముఖ్యంగా పట్ట ణ ప్రాంతాల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, మధ్యవర్తుల ద్వారా అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమకు అనుకూలమైన అభ్యర్థులకు పోస్టులు ఇప్పించేందుకు అధికారుల పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత ఉన్నా అడిగినంత ఇవ్వకపోతే పోస్టు దక్కద నే ప్రచారం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఎంపిక ప్రక్రియలో అసలు సమస్య అక్కడేనా?
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. అభ్యర్థి సంబంధిత ప్రాంతానికి స్థానికురాలై ఉండడంతోపాటు నిబంధనల ప్రకా రం రిజర్వేషన్ కేటగిరీకి చెందినవారై ఉం డాలి. విద్యార్హతగా ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఉన్నత విద్యను పూర్తి చేసి ఉం డాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అర్హతలను పరిశీలించే ప్రక్రియ చేపడతారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల వివరాల పరిశీలన సమయంలోనే అసలు సమ స్య మొదలవుతోందనే ఆరోపణలు ఉ న్నాయి.
అంగన్వాడీ సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రభావం పనిచేస్తోందని అ భ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు అనుకూలమైన అభ్యర్థుల పేర్లను సిఫారసు చే యా లంటూ కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, దీంతో అర్హత కలి గిన అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాల్వంచలో ఆడియో కలకలం
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 45వ డివిజన్‌లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టు విషయంలో వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులతో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ.. కార్పొరేటర్ ద్వారా పోస్టు ఇప్పిస్తానంటూ బేరసారాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇందుకోసం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని మాట్లాడినట్లు చెబుతున్న ఆడి యో బయటకు వచ్చింది. ఈ వ్యవహారంతో తనకు అన్యాయం జరుగుతోందని భావించిన ఓ అభ్యర్థి రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు కలిగి ఉన్న తనకు న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ ఫిర్యాదుతో అంగన్వాడీ పోస్టుల భర్తీ పారదర్శకతపై అనుమానాలు మరింత బలపడ్డాయి. పాల్వంచ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరే టర్ గతంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసినట్లు సమాచారం. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీ యాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు.
ఇల్లెందులోనూ..
ఇల్లెందు మున్సిపల్ పరిధిలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టు విష యంలోనూ వివాదం తలెత్తింది. అర్హతలు ఉన్న అభ్యర్థులను పక్కనపెట్టి తన బంధువులకు పోస్టు ఇప్పించేందుకు ఓ మున్సిపల్ కౌ న్సిలర్ ప్రయత్నిస్తున్నారంటూ ఓఅభ్యర్థి ఐసీడీఎస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా రు. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంగన్వా డీ పోస్టుల భర్తీలో ప్రజాప్రతినిధుల జోక్యం పై ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
పారదర్శకంగా భర్తీ చేయాలి
అంగన్వాడీ పోస్టుల భర్తీ పూర్తి నిబంధనల ప్రకారం, పారదర్శకంగా జరగాలని దర ఖాస్తుదారులు కోరుతున్నారు. రాజకీయ పలుకుబడి, ఆర్థిక స్థోమత ఆధారంగా కా కుండా అర్హత, మెరిట్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా రు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులపై అధికారులు నిఘా పెట్టాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కో రుతున్నారు.
మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక
అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ నూటికి నూరు శాతం పారదర్శకంగా జరుగుతుంది. అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తాం. ఇంటర్వ్యూలో వెయిటీజీ కింద పది మార్కులు కలుపుతాం. పోస్టుల భర్తీలో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమాత్రం ఉం డదు. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అభ్యర్థులను మభ్యపెడితే వారి మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దు. అర్హ త ఉన్న అభ్యర్థికి నిబంధనల ప్రకారం ఉద్యో గం లభిస్తుంది.
లెనినా, ఐసీడీఎస్ పీడీ,
భదాద్రి కొత్తగూడెం జిల్లా






