చేప పిల్లలు రెడీ.. చెరువుల్లో నీళ్లేవి?
30,304 చెరువుల్లో చేప పిల్లల విడుదలకు కార్యాచరణ
రూ.116 కోట్లు కేటాయింపు
13,353 చెరువుల్లోనే పంపిణీ
సగానికి పైగా చెరువులు ఖాళీ
పథకం అమలుపై సందిగ్ధత
మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి) : చేప పిల్లలు(young fish) సిద్ధంగా ఉన్నాయి.. టెండర్లు(Tenders) పూర్తయ్యాయి. నిధులూ ఉన్నా యి. కానీ, వాటిని వదిలేందుకు చెరువల్లో సరిపడా నీళ్లు లేవు. వర్షాభావం కారణం గా రాష్ట్రంలో చాలావరకు చెరువులు, కుంటలు ఎండిపోయి. మరికొన్నింటిలో ఇటీవల వర్షాలకు కొంతమేరకే నీరు చేరడం తో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలు(Implementation of the free fish seed distribution scheme)పై సందేహాలు వ్యక్తమవుతున్నా యి. ఈ ఏడాది 30,304 చెరువుల్లో 80 కోట్ల చేప పిల్లలను వదలాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రూ.116 కోట్లు కేటాయించింది.
కానీ, ఇప్పటి వరకు కేవలం 13,353 చెరువుల్లోనే చేప పిల్లలను వదిలారు. మిగిలిన చెరువుల్లో నీటి లభ్యంత లేకపోవడంతో మత్స్యశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఫలితంగా లక్షలాది మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో 30,304 చెరువుల్లో చేపపిల్లల పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది చెరువులనే ఈసారి కూడా లెక్కలోకి తీసుకున్నారు. గతంలో నీటి లభ్యంతో సంబంధం లేకుండా జాబితాలో ఉన్న అన్ని చెరువుల్లో చేపపిల్లలను వదిలేవారు.
ఇటీవల కురిసిన వర్షాలు ఉత్తర తెలంగాణకు ఊరటనిచ్చినప్పటికీ దక్షిణ తెలంగాణ లో మాత్రం ఆశించిన వర్షాలు పడలేదు. ఎల్ నినో ప్రభావంతో 50 శాతానికి పైగా జలాశయాలు, చెరువులు అడుగంటిపోయా యి. ఇప్పటీ వరకు కురిసిన కొద్దిపాటి వర్షాలతో 13, 353 చెరువుల్లో నీరు ఉండటంతో చేపపిల్లలను ఆ చెరువుల్లో మాత్రమే విడుద ల చేశారు. నీటి చుక్క లేని చెరువుల్లో చేపపిల్లలను ఎలా విడుదలకు కేటాయిస్తారన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చకుదారితీసింది. ఇప్పటికే జిల్లాల వారీగా టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను కూడా సిద్ధం చేసింది.
32 జిల్లాలకు 140 మంది కాంట్రాక్టర్లు..
ప్రభుత్వ చేప పిల్లల భుత్వం చేపపిల్లల పంపిణీకి టెండర్లను ఆహ్వానించింది. టెండ ర్ ప్రక్రియ ముగిసింది. 32 జిల్లాలకు సుమా రు 140పైగా కాంట్రాక్టర్లు టెండర్ వేసినట్లు సమాచారం. తాము కోట్ చేసిన మొత్తం పరిమాణానికి కాంట్రాక్టు దక్కుతుందా లేదా అనేది కాంట్రాక్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు శాతం చెరువు, జలాశయాల్లో మాత్రమే నీరు ఉండటంతో నీరు ఉన్న చెరువులకే చేపపిల్లల పంపిణీ బాధ్యత అప్పగి స్తారా? లేదా? అనేది కూడా చర్చకు కారణమైంది.
మరోవైపు కాంట్రాక్టర్లకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు అవుతుందా? గతం లో అయితే జిల్లాల్లోని అన్ని చెరువుల్లో నీరు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు సగం చెరువుల్లో మాత్రమే నీరు ఉండటంతో ప్రభుత్వం ఎలా టెండర్ బాధ్యతలను అప్పగిస్తుందనేది చూడాలి.
అదును దాటితే ఎదుగుదలపై ప్రభావం..
చాలా చెరువుల్లో చేప పిల్లలను వదలకపోవడం, మరోవైపు అదును దాటిపోతుండ టంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో చేప పిల్లలు వదలకపోతే ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని పే ర్కొంటున్నారు. నీళ్లున్న చెరువుల్లోనైనా త్వ రగా చేప పిల్లలు పంపిణీ చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎండిపోయిన చెరువుల్లో సైతం చేపలు వేసినట్లు కాగితాల్లో చూపించి కోట్లాది రూపాయల నిధులు పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈసారి అలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. డబ్బాల పరిమాణాన్ని బట్టి కాకుండా వేయింగ్ బ్రిడ్జిల వద్ద వాహనాలను నిలిపి తూకం ఆధారంగా నమోదు, కౌంటింగ్ చేయనున్నారు. లోకల్ ప్రజాప్రతినిధులు, అధికారులకే ఆ బాధ్యత అప్పగించ డంతో పారదర్శకంగా చేపపిల్లల పంపిణీ కొ నసాగే అవకాశం ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల నుంచి వచ్చే సమాచారం మేరకే..
చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా చెరువుల్లో నీటి నిల్వ వివరాలను తీసుకుంటోంది. కానీ, అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి పూర్తి వివరాలు అందలేదని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఎన్ని చెరువు, కుంటల్లో నీరు ఉందని, ప్రాజెక్టుల్లో నీరు ఎంత ఉంది.. చేపపిల్లలు పోస్తే ఏమేరకు పెరుగుతాయని, మత్స్యకారులు జీవనోపాధి లభిస్తుందనే వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు టీమ త్స్య యాప్‌లో పూర్తిస్థాయిలో వివరాలు అప్ లోడ్ చేయలేదు. జిల్లాల వారీగా కలెక్టర్ల ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం తీసుకునే తుదినిర్ణయం కోసం మత్స్యకార్మికులు ఎదురుచూస్తున్నారు.






