31 August, 2026 | 2:32 AM

ప్రపంచస్థాయి తెలంగాణ

31-08-2026 01:33 AM
  1. వెయ్యి రోజుల ప్రజాపాలన
  2. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా పాలన
  3. 25 లక్షలకుపైగా రైతులకు రుణమాఫీ
  4. ౩౩౫ కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
  5. 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ 
  6. ఉపాధి, పెట్టుబడులు, మౌలిక వసతులకు పెద్దపీట

హైదరాబాద్, ఆగస్టు 30(విజయక్రాం తి): ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A. Revanth Reddy) సారథ్యం లో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నాటి కి విజయవంతంగా వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ప్రజల ఆకాంక్షలే కేంద్రబిందువుగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీ సుకెళ్తూ ప్రగతిలో కొత్త అధ్యాయానికి నాం ది పలికిందని ప్రభుత్వం పేర్కొంది.

రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికు లు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్ర యోజనకర పథకాలతో పాటు కొత్త చట్టాలు, విధానాలు, కీలక సంస్కరణలను అమలు చేసింది. భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగావకాశాలు, ప్రపంచస్థా యి మౌలిక వసతులకు బాటలు, భవిష్యత్ తెలంగాణ కోసంప్రణాళికలు రూపొందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించింది. 

రైతు సంక్షేమానికి పెద్దపీట

25 లక్షలకుపైగా రైతు కుటుంబాలు రుణ విముక్తి పొందాయి. రైతుభరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం, సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, ఉచిత విద్యుత్తు, రైతు బీమా, పంట నష్టపరిహారం చర్యలతో రైతులకు భరోసా. వరి సా గు, ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నంబర్ వన్‌గా నిలిచింది. తెలంగాణ బియ్యానికి అం  మార్కెట్‌ను విస్తరించే చర్యల్లో భా గంగా ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం కుదిరింది.

ఇందిరా సౌర గిరిజల వికాసం కింద 2.10 లక్షల గిరిజన రైతులకు ప్రయోజనం కల్పి స్తూ 6 లక్షల ఎకరాల పోడు భూములకు సా గునీరు అందించాలనే లక్ష్యంతో రూ.12, 600 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటాల కోసం కార్యాచరణ, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం,

మహిళలకు భరోసా

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సు ల్లో ఇప్పటివరకు 335 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేయగా, రూ.11 వేల కోట్లు ఆదా  గృహజ్యోతి పథకం కింద 53 లక్షలకుపైగా కుటుం బాలకు ఉచిత విద్యుత్ అందించారు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు.

కల్యాణలక్ష్మి ద్వా రా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. 4.54 లక్షల మహిళా సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజీతో పాటు రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చా రు.  

ఆహార భద్రత, గృహ నిర్మాణం.. 

15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులు జా రీ, సన్నబియ్యం పంపిణీ, స్మార్ట్ రేషన్ కార్డు లు అందజేస్తున్నారు. తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టా రు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణానికి నిర్ణయం. 43.01 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందుతున్నాయి.

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పూర్తి చేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమ లు చేసిన దేశంలోని తొలి రాష్ర్టంగా తెలంగాణ నిలిచింది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చే బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది.  

కార్మికుల హక్కులు, కొత్త చట్టాలు

కనీస వేతనాల సవరణను చేపట్టి దాదా పు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్ర యోజనం కల్పించారు. గిగ్ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత చట్టం తీసుకొచ్చారు. వృద్ధ తల్లిదండ్రుల కోసం ప్రత్యేక చట్టం రూపకల్పన చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేము ల తెలంగాణ బిల్లును రూపొందించారు.

విద్యా రంగంలో సంస్కరణలు

పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగా ణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి సాధించింది. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూ రు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మ ధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 212 శాతం పెంపు, మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది టీచర్ల నియామకం, 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించారు. ఓ యూకు రూ.1,000 కోట్లు కేటాయించారు.

ఉద్యోగాలు, యువతకు నైపుణ్య శిక్షణ

72 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. గ్రూప్- గ్రూప్- గ్రూప్- గ్రూప్ డీఎస్సీ సహా కీలక నియామక ప్ర క్రియలను పూర్తి చేశారు. టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టుల భర్తీకి, 7,437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఏటీసీలుగా మారుస్తున్నా రు.

టీ-హబ్, టీ-వర్క్స్, టా స్క్, వీ-హబ్ ద్వారా 90 వేలకుపైగా జాబ్‌మేళాల ద్వారా 5,700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ద్వారా క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు చేపట్టారు.

వైద్య రంగంలో విస్తరణ

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2 వేల పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సనత్‌నగర్‌లో టిమ్స్‌ను ప్రారంభించారు. అల్వాల్, ఎల్బీనగర్‌లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 9 కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం, మరో 17 మెడికల్ కాలేజీల ఏ ర్పాటుకు చర్యలు. 2025- తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. ఇది దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం.