28 June, 2026 | 2:17 AM

ఎల్ నినో ముప్పునకు బదులిద్దాం!

28-06-2026 12:00 AM

తెలంగాణలో వానాకాలం సాగు కాలంప్రారంభమైంది. ఈ సమయం లో ప్రపంచ వాతావరణ వ్యవస్థలో వస్తున్న మార్పులు దేశవ్యా ప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పసిఫిక్ మహా సముద్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు భారత వాతావరణాన్ని ప్రభావితం చేసేలా కనిపిస్తున్నా యి. రుతుపవనాలు ఆలస్యం కావడం, వచ్చిన ఆ పవనాలను కూడా పసిఫిక్ మహా సముద్రంలోని వేడిగాలులు ప్రభావితం చేయడం, తద్వారా పవనాల మందగమనం భారత వ్యవసాయరంగాన్ని ప్రభావితం చేస్తున్నది.

వర్షపాతం అంతంతమాత్రంగానే నమోదవడంతో సాగు ఆలస్యమ వుతున్నది. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రం లో తూర్పు ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వైపు గాలులు వీస్తాయి. ఎల్ నినో సమయంలో రుతుపవనాల గమనం బలహీనపడుతుంది. దీనివల్ల.. మధ్య, తూర్పు పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధా రణంగా పెరుగుతాయి. ఈ మార్పు ప్రపంచవ్యాప్త వాతావరణ నవనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

భారతదేశంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దేశానికి జీవనాధారమైన నైరుతి రుతుపవనాల బలం తగ్గుతుంది. వర్షాలు సకాలంలో రావు. కొన్నిసార్లు సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దేశవ్యాప్తంగా ప్రాంతాల వారీగా అసమాన వర్షాలు కురుస్తాయి. తెలంగాణపై కూడా దీని ప్రభావం వివిధ రూపాల్లో కనిపించనుంది. రాష్ట్రంలో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నది.

చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు వర్షాల వల్లనే నిండుతాయి. ఎల్ నినో వల్ల జూన్ నెలలో రావాల్సిన వర్షాలు ఆలస్యమవుతున్నాయి. దీనివల్ల విత్తనాలు వేసే ప్రక్రియ బాగా వెనుకబడుతుంది. కొన్ని జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. భారీ వర్షం కురిసిన తర్వాత పెద్ద విరామం రావొచ్చు.  పరిస్థితులు ఇలా ఉన్నా రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులను అవగాహన చేసుకుని ముందస్తు ప్రణాళికలతో సాగు పనులు చేపడితే నష్టాలను తగ్గించుకోవచ్చు.

తొలి వర్షాలకే తొందరపడి విత్తనాలు వేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు వర్షాలకు నేల పూర్తిగా తడవదు. భూమిలో తగినంత తేమ నిల్వ ఉన్నప్పుడే విత్తనాలు నాటాలి. అప్పుడే వర్షాలు ఆలస్యమైనా మంచి మొలక శాతం వస్తుంది. వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలనే వాడాలి. తక్కువ కాల వ్యవధిలో అంటే 120 రోజుల్లోపు చేతికి వచ్చే పంట రకాలను ఎంచుకోవాలి. తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే వరి పంటకు నీరు ఎక్కువ కావాలి.

అందువల్ల నీటిలభ్యతను ముందే అంచనా వేసుకోవాలి. నీటి కొరత ఉన్న చోట వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలి. నర్సరీలను దశలవారీగా పోసుకోవాలి. ప్రత్యక్ష విత్తన వరి పద్ధతిని పరిశీలించాలి. వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సా గుపై దృష్టి పెట్టడం చాలా మేలు. కంది, పెసర, మినుములు, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు, వేరుశనగ వంటి పంటలకు తక్కువ నీరు సరిపోతుంది. ప్రస్తుత మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్ ఉంది.

సాగులో నీటి యాజమాన్యం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. పొలాల చుట్టూ గట్లు నిర్మించి వర్షపు నీటిని బయటకు పోనివ్వకుండా చూసుకోవాలి. తోటల్లో ఫార్మ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవాలి. చెరువుల పూడికతీత పనులు చేపట్టాలి. సాగు కోసం డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను ఉపయోగించాలి. నేలలో తేమను కాపాడేందుకు రైతులు మల్చింగ్ పద్ధతిని వాడాలి. సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. కలుపు మొక్కలను సకాలంలో తొలగించి అంతర దుక్కులు దున్నాలి.

ఇవి తేమను కాపాడటంతో పాటు పంట ఎదుగుదలకు తోడ్పడతాయి. ప్రస్తుత ఆధునిక సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అధికారుల సలహాల ప్రకారం పురుగుమందుల పిచికారీ, ఎరువుల వినియోగం, సాగునీటి ప్రణాళికలు చేపట్టాలి. వాతావరణంలో అనిశ్చితి పెరుగుతున్నందున పంట బీమా తప్పనిసరిగా చేసుకోవాలి. పంటల నమోదు, బీమా వివరాలను సకాలంలో పూర్తి చేయడం వల్ల పెట్టుబడికి రక్షణ దక్కుతుంది. ఎల్ నినో అనేది ప్రకతి పరంగా వచ్చే వాతావరణ మార్పు మాత్రమే. దీనిపై ప్రతి ఏడూ ఒకేలా ప్రభావం ఉండదు. 

జి.మధు గౌడ్