8 June, 2026 | 3:47 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డిని పరామర్శించిన నాయకులు

08-06-2026 01:13 AM

భిక్కనూర్, జూన్ 7(విజయ క్రాంతి):  ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి సాయగౌడ్, గ్రామ సర్పంచ్ గొల్ల అరుణస్వామి యాదవ్, మాజీ సర్పంచ్ కుమ్మరి చంద్రం, మాజీ వార్డు సభ్యుడు పెంజర్ల శేఖర్ రెడ్డి, వార్డు సభ్యుడు పోలు మహేందర్ తదితరులు పాల్గొని ఆయనకు సంఘీభావం తెలిపారు.