15 July, 2026 | 12:12 AM

ప్రైవేట్ పాఠశాల అనుకుంటే పొరపాటే..

15-07-2026 12:12 AM
  1. కార్పోరేటుకు దీటుగా.. ప్రభుత్వ గిరిజన పాఠశాల...
  2. ఇతర మండలాల నుంచి విద్యార్థుల చేరిక...

ఉట్నూర్, జూలై 14 : కార్పొరేటు, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఐటీడీఏ ఆధ్వర్యంలోని (గిరిజన విద్యా వికాస కేంద్రం) టీడ బ్ల్యూ పాఠశాల పని చేస్తుందనడానికి నిదర్శనమే ఇంద్రవెల్లి మండలం చిత్రుగూడాలోని గిరిజన పాఠశాల... ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు 34 మంది విద్యార్థులకు ఇద్దరు ఆంగ్లంలో విద్యాబోధన చేస్తు న్నారు.

గిరిజన పాఠశాలలో విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు కార్పొరేట్ స్థాయి లో ఇంగ్లీష్ విద్యను బోధిస్తుండటం, ఉపాధ్యాయులు విద్యార్థులపై చూపిస్తున్న శ్రద్ధను గమనించిన గ్రామస్తులు సైతం తమవంతుగా విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండే విధంగా ప్రభుత్వం అందజేసిన యూనిఫాంతో పాటు అదనంగా ఒక్కో విద్యార్థికి రెండేసి యూనిఫాంలు, ప్రతి వి ద్యార్థికి టైలు కొనుగోలు చేసి విద్యార్థులను రెడీ చేసి పంపిస్తున్నారు. 

ఇతర మండలాల నుంచి విద్యార్థుల రాక...

చిత్రుగూడాలోని గిరిజన పాఠశాలలో గత ఏడాది 22 మంది విద్యార్థులు విద్యను అభ్యసించగా, ఈ విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 34 మంది విద్యార్థులకి చేరింది. ఇందులో గోండు కులస్తులే అధికం. నాణ్యమైన ఆంగ్ల విద్యతోపాటు వసతులు ఉండ టంతో ఈ ఏడాది గాదిగూడ మండలం నుంచి ముగ్గురు, నార్నూర్ నుంచి ఇద్దరు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చొర్గావ్ గ్రామం నుంచి ముగ్గురు విద్యార్థులు అడ్మీషన్ తీసుకున్నారు. గాదిగూడ మండలంలోని ఇతర గ్రామాల్లో ప్రైమరీ, ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉన్నప్పటికి ఆ పిల్లలను ఈ పాఠశాలలోనే చదివించేందుకు చిత్రుగూడాలోని వారి బంధువుల ఇంట్లో ఉంచి మరి చదివిస్తున్నారు. 

గ్రామస్తుల సహకారం...

ఈ గిరిజన పాఠశాలలో అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్మారాం, కుమ్రం జంగులు పిల్లలకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యా బోధన అందిస్తుండగా గ్రామస్తులు సైతం వారికి అండగా నిలుస్తున్నారు. పాఠశాలలో వసతుల కల్పనకు ప్రభుత్వం అందించే సాయానికి గ్రామస్తులు సైతం సహకారాన్ని అందిస్తున్నారు. ఉపాధ్యాయుల బోధనకు మరింత ప్రోత్సహించే విధంగా అన్ని విధాల సహకరిస్తున్నారు. ఈ పాఠశాలను ఆదర్శంగా తీసు కొని మిగితా ఆదివాసీ గిరిజన గూడాల ప్ర జలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉపాధ్యాయులకు అండగా నిలిస్తే ప్రతి ఆదివాసి గూడెం గిరిజన పిల్లలు చదువులో రాణిస్తారనడంలో ఎలాంటి అతిశ యోక్తి కాదు. 

చిత్రుగూడ గ్రామస్తులను ఇత ర గ్రామాల ప్రజలు ఆదర్శంగా తీసుకొని విద్యాలయాలకు, విద్యార్థులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి గిరిజన పాఠశాలలకు ఐటీడీఏ బాస్, అధికారులు అన్ని విధాలా మరింత ప్రోత్సహించా లని విద్యావంతులు కోరుతున్నారు.