15 June, 2026 | 8:14 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ఎంజీయూ డిగ్రీ 12 బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం

04-02-2026 12:00 AM

నల్గొండ టౌన్, ఫిబ్రవరి 3: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్ లాగ్  పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు సిఓఈ డా ఉపేందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆలస్య రుసుము లేకుండా మార్చి 4 వరకు చెల్లించవచ్చునని, 100 రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు చెల్లించవచ్చన్నారు.

రెండు సబ్జెక్టులలోపు పరీక్ష రుసుము చెల్లించేవారు- బిఎ విద్యార్థులు 625, బీకాం మరియు బీకాం కంప్యూటర్స్ 675 , బీఎస్సీ విద్యార్థులు 675 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టులకు పైబడిన బిఏ విద్యార్థులు 950, బీకాం బీకాం కంప్యూటర్స్ 1015, బి ఎస్ సి 1015 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వ్బుసైట్, సంబంధిత కళాశాలను సంప్రదించాలని కోరారు.