13 May, 2026 | 12:49 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

జాతీయస్థాయి పోటీలకు కుంట్లూర్ విద్యార్థుల ఎంపిక

18-11-2025 12:00 AM

మల్కంబ్, లంగిడి పోటీల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు 

అబ్దుల్లాపూర్ మెట్, నవంబర్ 17 : పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో ఉన్న వ్యాస్ మోడల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మల్కంబ్, లంగిడి పోటీల్లో ప్రతిభచాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మల్కంబ్ జాతీయస్థాయి పోటీలకు వేముల యశశ్విని, లంగిడి జాతీయస్థాయి పోటీలో వేముల యజ్ఞ, జాను ఎంపికయ్యారు. వీరు గుజరాత్ రాష్ట్రంలోని వడదొరాలో ఈ నెల 21 నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని వ్యాస్ స్కూల్ పీఈటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఈ 24న జరగనున్న మల్కాoబ్ పోటీల్లో యశశ్విని పాల్గొంటుంది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన  ముగ్గురు విద్యార్థుల్లో యశశ్విని, యజ్ఞ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. జాతీ య స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు వ్యాస్ మోడల్ స్కూల్ చైర్మన్ సర్వేశ్వర్ రెడ్డి, కోచ్ నీలేశ్ అభినందనలు తెలిపారు.