13 May, 2026 | 1:47 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు

18-11-2025 12:00 AM

కలెక్టర్ హనుమంతరావు హెచ్చరిక 

యాదాద్రి భువనగిరి , నవంబర్ 17 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాలకు కాంట్రాక్టర్లు  సరిపడ  లారీలు పంపించాలని లేనిచో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హనుమంతరావు  హెచ్చరించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఈరోజు ఎన్ని ధాన్యం కుప్పలు కొనుగోలు చేశారు.

ఇంకా తేమ శాతం వచ్చిన ధాన్యం కుప్పలు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.ఎంత లేట్ అయినా ఉండి లైట్ ఏర్పాటు చేసుకొని తేమ శాతం వచ్చిన  ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి  రోజు 4 లారీలు కేంద్రానికి వచ్చేలా చూడాలని  సివిల్ సప్లయ్ అధికారులకు ఆదేశించారు.  సరిపడ లారీలు పంపించకపోతే లేకపోతే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు పెట్టీ చర్యలు  తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లర్లు  ధాన్యం వచ్చిన  వెంటనే హమాలీల ద్వారా లారీల నుండి  అన్లోడ్ చేయాలన్నారు.