13 May, 2026 | 10:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

రిటైర్డ్ ఆర్మీ జవాన్ స్వాగతం.. సన్మానం

01-03-2026 02:38 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి) సంవత్సరాలు ఆర్మీలో పలు హోదాల్లో దేశ సేవ చేసి శనివారం రిటైర్మెంట్ తీసుకున్న నరకట్ల భాస్కర్ ఆర్మీ జవాన్ కు ఆదివారం మిత్రులు బంధువులు పరిసర ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. భాస్కర్ నిర్మల్ శాంతినగర్ గ్రామవాసి తన విద్యాభ్యాసం శాంతినగర్ ప్రాథమిక పాఠశాల, వడ్యల్ జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో జరిగింది.

1994-95 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన భాస్కర్ తదనంతరం ఆర్మీలో చేరాలని సంకల్పంతో శిక్షణ తీసుకొని ఆర్మీ జవాన్ గా సెలెక్ట్ అయ్యాడు. ఆనాటి నుంచి నేటి వరకు 24 సంవత్సరాలు నిరంతరంగా దేశ సేవకు అంకితమయ్యాడు. రిటైర్మెంట్ సందర్భంగా ఆయన చిన్ననాటి మిత్రులు వాద్యాల పాఠశాల ఆనాటి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలికి తన సన్మానం చేశారు తమ మిత్రుడు దేశ సేవకు అంకితమైన విషయాన్ని పలువురుతూ పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భాస్కర్ మిత్రబృందం ఆయన బంధుమిత్రులు ఆనాటి ఉపాధ్యాయులు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.