8 June, 2026 | 2:45 AM

ఎన్నా రైలతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం

08-06-2026 01:22 AM
  1. సింగపూర్‌లో కూడా తెలంగాణ సభ నిర్వహించండి
  2. ఎన్నారై ప్రతినిధుల విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూల స్పందన

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వెళ్లిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సమావేశంలో సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశు ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు.

అలాగే గతంలో కేసీఆర్ సింగపూర్, మలేషియా పర్యటనల సందర్భంగా అక్కడి అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. సింగపూర్, మలేషియా దేశాల్లో అమలవుతున్న అభివృద్ధి విధానాలలో తెలంగాణలో అనుసరించదగిన అంశాలపై కూడా చర్చ జరిగింది. తెలంగాణను ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధి నమూనాలను తీసుకురా వాల్సిన అవసరాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు సింగపూర్‌లో కూడా తెలంగాణ సభ నిర్వహించాలని కేటీఆర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో వివిధ తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు సమాజం సభ్యులు, తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు, బీఆర్‌ఎస్ ఎన్నారై సభ్యులు, సింగపూర్ వాసవి సభ్యులు పాల్గొన్నారు.

ప్రత్యేకంగా బస్సుల్లో మలేషియాకు చేరుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మంచిరెడ్డి ప్రశాంత్, బీఆర్‌ఎస్ సింగపూర్ సభ్యులు రంజిత్‌రావు, పెద్ది శేఖర్, రజినీకాంత్, కిరణ్ షెర్ల, టీసీఎస్‌ఎస్ సభ్యులు నల్లా భాస్కర్, రాజు, వీఏఎం సభ్యులు కైల నాగరాజు, రమణ, ఎస్టీఎస్ సభ్యులు కోటిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బైరి రవి తదితరులు పాల్గొన్నారు.