50 మంది యువతుల చదువుకు కేటీఆర్ చేయూత
- తన 50వ పుట్టిన రోజు సందర్భంగా నిర్ణయం
- వ్యక్తిగత ఖాత నుంచి భరిస్తానని ప్రకటన
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి) : ఈ నెల 24న తన పుట్టిన రోజును పుస్కరించుకుని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణ యం తీసుకున్నారు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా 50 మంది యువతుల చదువుకు చేయూత అందించనున్నట్టు ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన 50 మంది యువతుల చదువు, సాధికారత బాధ్య తను ఈ సంవత్సరం నుంచి తన వ్యక్తిగత ఖాతా ద్వారా భరిస్తానని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం ఫిల్మ్ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ‘స్పర్శ వార్షి క సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నటి అక్కినేని అమల గౌర వ అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ.. సమాజ సేవకు అంకితమైన ‘టచ్ ఏ లై ఫ్’ థీమ్‌తో సాగుతున్న ఈ సంస్థ, మహిళల విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడం మానవత్వమని, భవిష్యత్తులో ప్రభు త్వ పరంగా కూడా ఇలాంటి సత్కార్యాలకు పూర్తి సహకా రం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.






