4 July, 2026 | 1:44 AM

పీఆర్సీ ప్రకటించండి

04-07-2026 12:35 AM
  1. హెల్త్ కార్డులు జారీ చేయాలి
  2. సీఎస్‌కు టీజీవో నేతల వినతి

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా వేతన సవరణ (పీఆర్‌సీ) ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

పీఆర్సీని ప్రకటించడంతో పాటు హెల్త్ స్కీంను అమలు చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు జారీ చేయాలని, పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా సీఎం సెక్రటరీలు శేషాద్రి, శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌ను కలిసి విన్నవించారు.

ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు టీజీవో నేతలు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీజీవో నాయకులు ఎం. ఉపేందర్‌రెడ్డి, జగన్మోహన్ రావు, బి.వెంకటయ్య, డా. శ్రీరామ్‌రెడ్డి, ఎం.బి. కృష్ణయాదవ్, డా. కె. రామారావు, గండూరి వెంకటేశ్వర్లు, దీపారెడ్డి, శ్రీనివాసమూర్తి, శిరీష, సుజాత, శాంతిశ్రీ, యాదగిరి గౌడ్ తదితరులు ఉన్నారు.