పచ్చని చొప్పదండిలో చిచ్చు పెట్టొద్దు
రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న కేటీఆర్, హరీష్ రావు
చొప్పదండి, మార్చి 6 (విజయక్రాంతి): మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చొప్పదండి నియోజకవర్గంలో చిచ్చు పెట్టడానికి వస్తున్నాడని, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చిల్లర రాజకీయాలు చేయడంలో నంబర్ వన్ అని, నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు హితవు పలికారు.
శుక్రవారం గంగాధర మండలం మధురానగర్ లోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చొప్పదండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీని వాస్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్, హరీష్ రావు నియోజకవర్గాల్లోని కొండపోచమ్మ, మల్లన్న సా గర్ రిజర్వాయర్ల కోసం చొప్పదండి నియోజకవర్గం రైతులను బలి చేశారని, ఇక్కడి రైతుల భూములను లాక్కొని మోసం చేశారని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా చొప్పదండి నియోజకవర్గం లోని సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు. చొప్పదండి నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారో హరీష్ రావు చెప్పాలని డి మాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చొప్పదండి నియోజకవర్గం లో అభివృద్ధి శరవేగంగా దూసుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఓటీల నిర్మాణాన్ని ప్రారంభించి, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్న ఘనత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ద క్కుతుందన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం అందజేయడానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 23.50 కోట్లు మంజూరు చేయించారని, రానున్న రోజుల్లో మరో 20 కోట్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, జవ్వాజి హరీష్, వన్నెల రమణారెడ్డి, చిలువేరి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు పోత్తూరి మహేష్, బొమ్మరివేని తిరుపతి, బోయిని ఎల్లెష్, బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, నిజాపురం చందు, గంగాధర సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, మునిగల రాజేందర్, సువిన్ యాదవ్, మ్యాక వినోద్, వంగల శ్రీనివాస్, మనిష్, తదితరులు పాల్గొన్నారు.




