సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు
కన్నూర్: కేరళ రాష్ట్రం శ్రీకందపురంలో సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దేశద్రోహి అని పోస్టు చేసిన వ్యక్తిపై(Kerala Man) కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బీజేపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు శుక్రవారం కొట్టూరుకు చెందిన రాజన్ సి కొట్టూరుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, నిందితుడు మార్చి 3న ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రధాని మోడీని "దేశద్రోహి" అని అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్య చేశాడు.
ప్రధానమంత్రి పరువును హరించారని, అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినందుకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 192 కింద, చికాకు కలిగించినందుకు కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120(o) కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన తర్వాత శుక్రవారం సాయంత్రం దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారించి, వ్యాఖ్యను పోస్ట్ చేయడానికి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని దర్యాప్తులో భాగంగా గుర్తించనున్నట్లు పోలీసులు తెలిపారు.




