11 March, 2026 | 2:08 PM

Breaking News

హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •   కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం   •   తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం   •  

కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం

11-03-2026 12:17 PM

న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి కావూరు సాంబశివరావు(Kavuri Samba Siva Rao) కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాంబశివరావు తుదిశ్వాస విడిచారు. కావూరు సాంబశివరావు మలీపట్నం, ఏలూరు నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. మన్నోహన్ సింగ్ కేబినెట్ లో సాంబశివరావు కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కావూరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

కావూరు సాంబశివరావు 1943లో ఏలూరులో జన్మించారు. కావూరు వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజినీరింగ్ పట్టా తీసుకున్నారు. 'మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణించారన్న వార్త నాకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఎక్స్ లో పేర్కొన్నారు.