7 July, 2026 | 3:36 PM

Breaking News

పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •  

TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత

07-07-2026 02:23 PM

ఈసీకి సమాధానాలు చెప్పాకే.. కోర్టుకు రావాలని సూచన

హైదరాబాద్: TRS పార్టీ పేరు ఖరారుపై కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రక్షణ సమితి(Telangana Rashtra Samithi) పేరు తన పార్టీకి కేటాయించాలని కవిత కోర్టును కోరారు. ఈసీ నోటీసులకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. పిటిషన్ విచారణ చేపట్టడమంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని ఢిల్లీ ధర్మాసనం(Delhi High Court) స్పష్టం చేసింది. జూన్ 23న ఈసీ ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పాలని కోర్టు సూచించింది. టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయని కోర్టు తెలిపింది.

అభ్యంతరాలు ఏమీ ఇవ్వలేదని కవిత తరఫు న్యాయవాదులు(Kavitha Lawyers) ధర్మాసనానికి సూచించారు. వ్యక్తిగతంగా వాదనలకు అవకాశం ఇవ్వలేదని కవిత లాయర్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని ఈసీ తెలిపింది. టీఆర్ఎస్(TRS) అనేది ఒకే పేరుగా కనిపిస్తుందని ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) పేరు టీఆర్ఎస్ కు అర్థం వచ్చేలా ఉందని కోర్టు వెల్లడించింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఈసీకి సమాధానాలు చెప్పాకే కోర్టుకు రావాలని కవితకు ధర్మాసనం సూచన చేసింది.