పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
07-07-2026 03:18 PM
పెద్దకొత్తపల్లి: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, హాస్టల్, భోజనశాల, వంటగది, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కేజీబీవీలో రెగ్యులర్ స్పెషల్ ఆఫీసర్ లేకపోవడంపై స్పందిస్తూ త్వరలోనే నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేజీబీవీల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.






