7 July, 2026 | 4:36 PM

ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

07-07-2026 03:27 PM

చేర్యాల: జనగామ ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డి కృషితో చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.పెండింగ్‌లో ఉన్న ఇళ్ల మంజూరు సమస్యపై జింకల పర్వాతాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే జిల్లా కలెక్టర్‌తో ప్రత్యేకంగా చర్చించి, గ్రామానికి చెందిన గడ్డం కవిత, అప్పాల శ్రీలతలకు ఇళ్లను మంజూరు చేయించారు. ఇళ్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే నిరంతరం చొరవ చూపుతున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నారని గ్రామస్థులు కొనియాడారు.