7 July, 2026 | 4:34 PM

అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్

07-07-2026 03:16 PM

బోథ్,(విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు పూర్తి చేస్తుందని ఎమ్మార్పీఎస్ అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేసిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడాల స్వామి పేర్కొన్నారు. మంగళవారం బోత్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగివచ్చి పేదలకు న్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కారం రవి తోపాటు నాయకులు బిక్క రమణయ్య నారాయణ మహేష్ మాకు నూరి అడెల్లు సతీష్ తదితరులు పాల్గొన్నారు.