7 July, 2026 | 4:35 PM

కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్

07-07-2026 03:17 PM

కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచింది

హైదరాబాద్: కాళేశ్వరంపై(Kaleshwaram Lift Irrigation Project) బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) స్పందించారు. వారం రోజుల్లో నీళ్లు ఇస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మహేశ్ గౌడ్ హితవు పలికారు.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

కాళేశ్వరంపై ఇంజినీర్ల సూచనలు పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారిందని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఇంజినీర్లను పక్కనపెట్టి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరంపై కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ప్రకటనలు అనుభవరాహిత్యం అన్నారు. NDSA పైపింగ్, పునాదుల్లో లోపాలను గుర్తించిందన్నారు. లోపాలను సరిచేయకుండా నీళ్లు నిల్వ చేయాలా? అని ప్రశ్నించారు. BRSలాగా మేము అశాస్త్రీయంగా వ్యవహరించమని పేర్కొన్నారు.