హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు
మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ హెచ్చరిక
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని హోటళ్లలో పరిశుభ్రత పాటించకుంటే జరిమానులు తప్పవని బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ హెచ్చరించారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని హోటల్లు రెస్టారెంట్ లను కమిషనర్ గంగాధర్ తనిఖీలు నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా రాబోవు వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజల ఆరోగ్యాలను కాపాడే దిశగా హోటళ్ళలో నిల్వ ఉన్నటువంటి సామాగ్రి, తినుబండారాలను పరిశీలన చేయడం జరిగినది. హోటళ్ళలో చాలా రోజుల నుండి నిల్వ ఉన్నటువంటి సామాగ్రిని వెంటనే తొలగించాలని హోటల్ యజమానులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
కొన్ని హోటళ్ళలో శుభ్రత లేని కారణముగా వెంటనే శుభ్రం చేయించుకోవాలని లేని యెడల జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. శుభ్రత ప్రమాణాలు పాటించిన రెండు హోటళ్ళకు జరిమానాలు సైతం విదించడం జరిగినది. రాబోవు వర్షా కాలం దృష్ట్యా హోటళ్ళలో శుభ్రత పాటించాలని ప్రతీ రోజు హోటళ్ళను తనిఖీ చేయడం జరుగుతుందని శుభ్రత ప్రమాణాలు పాటించిన హోటళ్ళకు జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. హోటల్ యజమానులకు శుభ్రత ప్రమాణాలపై పలు సూచనలు జారీ చేయడం జరిగినది. జారీ చేసిన సూచనలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు.






