7 July, 2026 | 4:36 PM

బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

07-07-2026 03:24 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించిన నూతన గృహానికి ఘనంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించి, లబ్ధిదారులను పట్టు వస్త్రాలతో సత్కరించారు. నిరుపేదలకు సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేరుస్తోందని ఆయన తెలిపారు.