అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
07-07-2026 03:22 PM
కొల్లాపూర్ రూరల్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల కోసం పెద్దకొత్తపల్లి మండలం పరిసరాల్లోని బాచారం వద్ద నిర్మిస్తున్న స్వచ్ఛంద పునరావాస కాలనీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. అటవీ గ్రామస్తులకు గృహాలు, తాగునీరు, విద్యుత్, రహదారులు, విద్య, వైద్యం తదితర అన్ని మౌలిక సదుపాయాలతో మెరుగైన పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.






