4 August, 2026 | 4:50 AM

కర్ణాటక క్యాబినెట్ విస్తరణ

04-08-2026 01:16 AM
  1. కొత్తగా ౨౦ మందికి మంత్రి పదవులు
  2. మొత్తంగా ౩౩ మందితో ‘డీకే ’జంబో క్యాబినెట్
  3. మంత్రి పదవుల కేటాయింపుపై కొందరి అసంతృప్తి
  4. నియోజకవర్గాలు, సామాజికవర్గాల సమతుల్యత పాటించలేదని పెదవి విరుపు
  5. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా..
  6. మరో ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధం

బెంగళూరు, ఆగస్టు ౩: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. జూన్ 3న ఆ యన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, అదే రోజు ౧౩ మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తాజా మంత్రివర్గ విస్తరణలో మరో ౨౦ మందికి అవకాశం లభించింది.

వీరిలో 10 మంది కొత్త ముఖాలే కావడం విశేషం. ముఖ్యమంత్రితో కలిపి ప్రస్తుతం మంత్రుల సంఖ్య 33కు చేరింది. వీరిలో ఒక మంత్రి ప్రమాణ స్వీకారం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. బెంగళూరులోని లోక్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లో త్ 19 మంది కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ పరమేశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు. 

కొత్త మంత్రులువీరే 

డాక్టర్ అజయ్‌సింగ్, హెచ్‌సీ బాలకృష్ణ, కేఎస్ బసవంతప్ప, బసవరాజ్ రాయరెడ్డి, ఎ న్ చెలువరాయస్వామి, లక్ష్మణ్ సవది, మధు బంగారప్ప, ఎస్‌ఎస్ మల్లికార్జున్, బీ నాగవేంద్ర, నరేంద్ర స్వామి, సీ పుట్టరంగశెట్టి, రు ద్రప్ప లమాణి, రిజ్వాన్ అర్షద్, టీ రఘుమూర్తి, సంతోష్ లాడ్, కేఎం శివలింగే గౌడ, శివరాజ్ తంగడగి, విజయానంద్ కాశప్పనవర్, బీజెడ్ జమీర్ అహ్మద్‌ఖాన్. కాగా, ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరు మంత్రివర్గ జాబితాలో ఉన్నప్పటికీ చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.

దీంతో చివరి నిమిషంలో ఆమె ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మరోవైపు, సిద్ధరామయ్య క్యాబినెట్‌లో పనిచేసిన హెచ్‌సీ మహాదేవప్ప, హెచ్ కే పాటిల్, దినేష్ గుండూరావు, లక్ష్మీ హెబ్బాల్కర్ వంటి సీనియర్లకు ఈసారి చోటు దక్క లేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గా ల మధ్య సమతుల్యత పాటిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం సీనియర్లు, జూనియర్లతో కూడిన మంత్రివర్గాన్ని రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

వాల్మీకి స్కాం నిందితుడికి మంత్రి పదవి

వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాం ఆరోపణలతో గతంలో రాజీనామా చేసి అరెస్ట్ అయిన బీ నాగవేంద్రకు మంత్రివర్గంలో చోటు దక్కడంపై కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

అసంతృప్తి.. రాజీనామాలు

మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కని పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవి వస్తుందని భావించి, చివరకు భంగపడిన ఇండి ఎమ్మెల్యే యశవంత రాయ గౌడ పాటిల్, సాగర్ ఎమ్మెల్యే బేలూ రు గోపాలకృష్ణ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే బెళూ రు గోపాలకృష్ణ కూడా మంగళవారం రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. కాం గ్రెస్ అధిష్ఠానం మ హిళలకు ప్రాతినిధ్యం కల్పించలేదని, నియోజకవర్గాల సమతుల్యత సైతం పాటించలేదని పార్టీలో కొందరు సీనియర్లు పెదవి విరిచారు.

సామాజికవర్గాల వారీగా కూడా అన్యాయం జరిగిందని, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిం చారు. మరోవైపు, రాజీనామాల పర్వంపై సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు ఓపిక పట్టాలని, భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయని, ఎవరూ అసంతృప్తికి లోనుకావొద్దని సూచించారు. పార్టీలో ప్రతిఒక్కరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.