జంతర్ మంతర్ నిరసనలకు సరైన ప్రదేశం కాదా ?
- జంతర్ మంతర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్
- కేంద్రం వివరణ కోరిన సుప్రీంకోర్టు
- కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- శాంతిభద్రతలు పోలీసుల బాధ్యత
- ఢిల్లీ నిరసనలపై ముందస్తు ఆదేశాలకు నిరాకరణ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు( Jantar Mantar) నిరసనలు, ప్రదర్శనల కోసం ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంపై స్పందన కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court) సోమవారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది. రాజధానిలోని జంతర్ మంతర్ ఇకపై నిరసనలకు అనువైన వేదిక కాదని, అటువంటి సమావేశాలు నివాసితులకు అసౌకర్యం కలిగిస్తాయని, నిత్యావసర సేవలకు అంతరాయం కలిగిస్తాయని వాదిస్తూ సతీష్ చంద్ కౌశిక్(Satish Chand Kaushik) దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌లు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పార్లమెంట్, సెంట్రల్ విస్టా, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు జంతర్ మంతర్ అత్యంత సమీపంలో ఉన్నందున, రామ్‌లీలా మైదానాన్ని లేదా తగినంత విశాలమైన, సురక్షితమైన మరో మైదానాన్ని ప్రధాన నిరసన వేదికగా నిర్ణయించాలని పిటిషనర్ సూచించారు. కేంద్రం సూచనలు తీసుకురావాలని ఎస్ జీకి ఆదేశించింది. ఢిల్లీలో నిరసనలపై ముందస్తు ఆదేశాలకు నిరాకరించింది. శాంతిభద్రతలు పోలీసుల బాధ్యతని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఊహాజనిత ఘటనపై వ్యాఖ్యానించలేమని తేల్చిచెప్పింది. పోలీసులు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కుంటారని సూచించింది. తప్పు జరిగితే చట్టం తనపని చేస్తోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడే మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని ప్రకటించింది. నీట్ యూజీ పేపర్ లీక్(NEET UG paper leak) పై కాక్రోచ్ పార్టీ కేంద్రప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.






