calender_icon.png 23 February, 2026 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మరక్షణకు కరాటే సాధన అవసరం

23-02-2026 06:46:59 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఆత్మ రక్షణకు కరాటే సాధన అవసరమని ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల ఆవరణలో ఒకినవ మార్షల్ ఆర్ట్స్ డమీ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు సోమవారం కరాటే బెల్ట్ గ్రే డింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కె వసంత్ కుమార్ చీఫ్ ఎగ్జామినర్, బ్లా క్ బెల్ట్ హాజరయ్యారు.

అనంతరం కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో విజయం సాధించిన క్రీడాకారులకు బెల్ట్ లను సర్టిఫికెట్స్ లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ క్రీడాకారులను అభినందిస్తూ కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత, పట్టుదల, మెమొరీ పవర్, సాహసం పెరుగుతుందని, ఆత్మరక్షణకు తోడ్పడుతుందని అన్నారు. గ్రాండ్ మాస్టర్ కే వసంత్ కుమార్ మాట్లాడుతూ... చదువుతోపాటు కరాటే, మార్షల్ ఆర్ట్స్ క్రీడలను ప్రోత్సహిస్తున్న ఇండియన్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

చిన్న వయసులోనే కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మెంటల్ గా స్టామినా కూడా పెరుగుతుందని, రోగాలను దూరం చేస్తుందని, తల్లిదండ్రులు చిన్నారులను ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో విజయం సాధించిన క్రీడాకారులకు బెల్ట్ లను సర్టిఫికెట్స్ లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ కనకేష్, పీఈటీలు సత్యం, శివ,సతీష్, మమత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.