ఇఫ్తార్ విందులో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు
19-03-2026 01:32 AM
నిజాంసాగర్ మార్చి 18(విజయక్రాంతి ) నిజాంసాగర్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. మతసామరస్యాన్ని ప్రతికగా గ్రామాల్లో పండుగలు జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నాయకులు అడ్వాకెట్ రాంరెడ్డి,పండరి, మెంగారం శ్రీనివాస్, అజ్జం దుర్గయ్య, వడ్ల బ్రహ్మం, అనీస్ తదితరులు పాల్గొన్నారు.




