24 August, 2026 | 10:31 PM

Breaking News

పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •  

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

24-08-2026 07:34 PM

కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం 

హుజూరాబాద్,(విజయ క్రాంతి): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కసుబు సుల వెంకన్న అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాల విషయంలో కాంగ్రెస్ నాయకులు గూడూరు స్వామిరెడ్డి కోర్టులో కేసు వేయడం దురదృష్టకరం. ఈ వ్యవహారం జర్నలిస్టుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోందని, సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్క జర్నలిస్టు సుమారుగా లక్ష రూపాయలు వెచ్చించి గృహ నిర్మాణాలు చేసుకున్నారని ఇబ్బంది పెట్టడం సభవు కాదన్నారు.

ఈ విషయమై మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ , హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రణవ్ బాబు  ప్రత్యేక చొరవ తీసుకొని జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని  విజ్ఞప్తి చేశారు. సమస్యను మరింత జఠిలం కాకుండా సంబంధిత వర్గాలతో చర్చించి, జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

“జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతాయుతమైన వర్గం. వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదనివెంటనే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర రాజకీయ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తక్షణమే స్పందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.