24 August, 2026 | 9:13 PM

పీఆర్సీని ప్రకటించాలి

24-08-2026 07:46 PM

6 డిఏలు విడుదల చేయాలి

తపస్ మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి 

కొడిమ్యాల,(విజయక్రాంతి):  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం జరిగింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తలపెట్టిన సభ్యత్వ నమోదులో ఉపాధ్యాయులు పాల్గొని సభ్యత్వ నమోదు స్వీకరించారు. నమిలికొండ, తిప్పయిపల్లి, పూడూరు ఉన్నత పాఠశాలలో యూపీఎస్ రామకిస్టాపూర్, ఆరేపెల్లి, పూడూరు, అప్పారావుపేట, గౌరాపూర్, నర్సింహులపల్లి, శ్రీరాములపల్లి, తిప్పయిపల్లి నల్లగొండ, ఇందిరా నగర్, కొండాపూర్, బొల్లంచెరువు తదితర ప్రాథమిక పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సభ్యత్వ నమోదు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ... పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండిoగ్ లో ఉన్న 6 డిఎలను తొందరగా విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి,పాత పెన్షన్ పథకం అమలు చేయాలని, మోడల్ స్కూల్, కేజీబీవి సమస్యలు పరిష్కరించాలని, టెట్ పరీక్షలు రద్దు చేయాలి.

ఒకవేళ నిర్వహిస్తే అందరికీ క్వాలిఫై మార్కులు సమానంగా ఉండాలని, 317 జీ వో సమస్యలకు పరిష్కారం చేయాలని, 2008 డీఎస్సీ ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వంను కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి,జిల్లా మండల బాధ్యులు గోనె పెల్లి శ్రీనివాస్,రాజన్న, మిట్టపల్లి దేవరాజం, వెంకటేశం,గడ్డం తిరుమలరెడ్డి,శ్రావణి, మోహన చారి, విజయ్,తదితరులు పాల్గొన్నారు.