21-02-2026 01:45:17 AM
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మా జీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని గౌరవించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉన్నదని పీసీ సీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. పదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ కోసం పని చేశరాని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆయనకు తగిన గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.