భూగర్భ జలాల పెంపుకి “జలసిరి” పథకం
01-09-2026 | 11:31pm
ఎంపీడీఓ శైలజరాణి, సర్పంచ్ ప్రతిమ
రామగిరి,(విజయక్రాంతి): భూగర్భ జలాల పెంపుకే జలసిరి పథకమని(Jalasiri scheme) ఎంపీడీఓ బద్రి శైలజ రాణి(MPDO Badri Sailaja Rani), సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు అన్నారు. మంగళవారం రత్నాపూర్ గ్రామంలోని రామగిరి ఖిల్లా ప్రాంతంలోని మెగా పల్లె ప్రకృతి వనం ప్రాంతంలో రెండో ఫామ్ ఫండ్ నిర్మాణం పనులను సర్పంచ్ పల్లె ప్రతిమపీవీరావు, ఎంపీడీవో బద్రి శైలజా రాణి తో కలిసి ప్రారంభించారు. వి.బి.జి రామ్.జి ఉపాధి హామీ పథకం కింద ఈ నిర్మాణం జరుగుతుందన్నారు. 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో నిర్మాణం జరుగుతుంది. రూ.1.27 లక్షల నిధులు మెటీరియల్ కొరకు కేటాయించారు. 260 మస్టర్లు కేటాయించారు.






