బుమ్రా వచ్చేసాడు
అఫ్ఘన్‌తో సిరీస్‌కు రీ ఎంట్రీ
ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జట్టులో చోటు
గాయంతో హార్దిక్ దూరం
ఇంకా ఫిట్‌గా లేని నితీష్‌రెడ్డి
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా అఫ్గన్ తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో చోటు మాత్రం ఫిట్ నెస్ క్లియరెన్స్ పైనే ఆధారపడి ఉంది. నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్ , హర్షిత్ రాణా ఫిట్‌నెస్‌పైనా సస్పెన్స్ నెలకొంది.
ముంబై , సెప్టెంబర్ 1: త్వరలో అఫ్గానిస్థాన్ జరిగే మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు తెలుగు తేజం తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గాయాల నుంచి కోలుకున్న నలుగురు కీలక ఆటగాళ్లు రీ ఎంట్రీ ఇచ్చారు. గాయాలతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Team India star pacer Jasprit Bumrah)తో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లు పునరాగమనం చేశారు.
అయితే ఈ నలుగురు ఫిట్నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ పేర్కొంది. ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితేనే జట్టులో కొనసాగుతారని స్పష్టం చేసింది.స్టార్ పేసర్ బుమ్రా ఆసియా గేమ్స్ కు ముందు కోలుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం.ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో ఎడమ మోకాలికి గాయం కావడంతో అతడు జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్కు కూడా దూరంగా ఉన్నాడు.
జింబాబ్వేపై అద్భుత ఫామ్ కనబరిచిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్లో చోటు లభించింది. టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మతో పాటు వైభవ్ కీలకం కానున్నాడు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఉండగా, మిడిలార్డర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, శివమ్ దూబే ఆడనున్నారు. ఆసియా క్రీడల్లో బరిలోకి దిగే భారత జట్టు కూడా దాదాపు ఇదే తరహాలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్కు కూడా దూరమయ్యాడు. ప్రాక్టీస్లో అతని కాలికి గాయం కావడంతోనే ఎంపిక చేయలేదు. అయితే బీసీసీఐ మాత్రం హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.నితీష్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వడంతో సూర్యాన్ష్ షెడ్గే చోటు కోల్పోయాడు. ఆర్సీబీ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా రీఎంట్రీతో గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్ వంటి యువ పేసర్లకు అవకాశం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే
సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గాన్లో సరైన క్రికెట్ మైదానాలు లేకపోవడంతో ఆ జట్టు దుబాయ్, భారత్ వేదికగా తమ ఆతిథ్య మ్యాచ్లు ఆడుతోంది.
భారత టీ ట్వంటీ జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.






