29 July, 2026 | 9:13 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

నాచారం గుట్టలో జల ప్రసాదం ప్లాంటు ప్రారంభం

05-06-2026 06:33 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన జల ప్రసాదం ప్లాంటును గజ్వేల్ మాజీ శాసనసభ్యులు తూంకుంట నర్సారెడ్డి, ప్రముఖ జ్యోతిష్యులు పరాంకుశం వేణు స్వామి కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ జల ప్రసాదం ప్లాంటును ఏర్పాటు చేసినట్లు దాతలు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.