రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దే..
కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్దిపేట, మే 5 (విజయక్రాంతి): రైతులు నిరసన తెలిపితే సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్ దేనని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలోని మార్కెట్ యార్డులో గన్నీ సంచులు కొరత ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. సిద్ధిపేట మార్కెట్ యార్డు లో రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు ఉన్నాయని, రైతులు నిరసన తెలిపితే సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్ కే దక్కిందని, ఇప్పుడు అన్ని రకాలుగా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. మక్కా రైతుల కోసం 15 వేల బ్యాగులు అవసరమని తెలియడంతో వెంటనే ఇంచార్జ్ మంత్రి వివేక్ తో మాట్లాడగా స్పందించిన మంత్రి మార్కెట్ ఫెడ్ డీఎం తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రెటరీ అర్షద్ హుస్సేన్, నాయకులు సాదిక్, ముదస్సిర్, రాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






