6 May, 2026 | 2:18 AM

జొన్న కూడా కొనుగోలు చేయాలి

06-05-2026 01:28 AM
  1. క్యాబ్‌నెట్ సబ్ కమిటీలో నిర్ణయం  
  2. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకుని, మొక్కజొన్న పంటతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన సబ్ కమిటీ సమావేశంలో ఈ మేర కు నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటనిస్తుందన్నారు.

ఈ నిర్ణయానికి సీఎం రేవంత్‌రెడ్డి, సబ్ కమిటీ సభ్యులకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. మొక్కజొన్న, జొన్న పంటలను ప్రైస్ సపోర్ట్ స్కీమ్ పరిధిలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమా ర్లు కోరినప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం ఏమాత్రం స్పందించలేదని  విమర్శించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా మొక్కజొన్న, జొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు బహిరంగ మార్కెట్లో లభించిన ధరలకే తమ పంటను అమ్ముకుం టున్నారని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాసంగి లో 278 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించినట్లు మంత్రి చెప్పా రు. ప్రస్తుతం రైతులు తమ జొన్న పంట ను మార్కెట్లకు తీసుకురావడం ప్రారంభించిన నేపథ్యంలో, మార్కెట్లో గిట్టుబాటు ధర లు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రస్తుత రబీ సీజన్‌లో రాష్ట్రం లో మొక్కజొన్న పంటను సుమారు 11.21 లక్షల ఎకరాలలో సాగు చేయగా, అనుకూల వాతావరణ పరిస్థితులతో ఎకరానికి సగటు 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు మంత్రి తెలిపారు. జొన్న 3.68 లక్షల ఎకరాలలో సాగు చే యగా, ఎకరానికి సరాసరి క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం వివిధ పం టల కొనుగోళ్ల కోసం దాదాపు రూ. ఆరు వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు.