బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం
హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్, మే 31 :రానున్న రోజు ల్లో హుజూర్‌నగర్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే,బీజేపీ ఎన్ ఆర్‌ఐ విభాగం స్టేట్ కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు...హు జూర్ నగర్ అభివృద్ధికి గతంలో అందరితో కలిసి పని చేశానని గుర్తు చేశారు. అవినీతి మచ్చ లేకుండా పనిచేసేది బీజేపీ పార్టీ మాత్రమేనని,ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.
దేశంలో,రాష్ట్రాల్లో జాతీయవాదం రావాల్సిన అవసరం ఉందన్నా రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా చెప్పిన హామీలు అన్నీ అబద్ధాలేనని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ కనిపిస్తున్నాయని,నేడు అభివృద్ధి జరగడం లేదన్నారు. అధికారులతో కలిసి జర్నలిస్టులకు ఇంటి పట్టాలిస్తే ఇప్పుడు వాటికి అనుమతులు లేవు అంటున్నారన్నారు.రింగ్ రోడ్, సీసీ రోడ్లు,పలు గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ తమ హయాంలోనే జరిగాయని తెలి పా రు.వ్యవసాయ కళాశాల పేరుతో రైతులను మోసం చేశారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని ఆరోపించారు. మట్టి మాఫియా రాజ్యమేలుతోం దని, ఇతర పార్టీల నేతలను బెదిరిస్తున్నారని అన్నారు.
హుజూర్ నగర్ లో డ్రగ్స్, గంజా యి విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఘ ర్షణలో గంజాయి మత్తులో ఉన్న యువకు ల ప్రమేయం ఉందన్నారు.హుజూర్ నగర్ గంజాయిమయం అయిందని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు గత ప్రభు త్వమే నిధులు మంజూరు చేసిందని,అదే జీఓతో ప్రస్తుతం పనులు చేస్తున్నారని చెప్పా రు. పేదల కోసం చెప్పిన సింగిల్ బెడ్రూం ఇళ్లు మూడు సంవత్సరాలుగా వాయిదా పడుతున్నాయని విమర్శించారు.
మినీ ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలు ఆగిపోయాయని,ఈఎస్‌ఐ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, ఈసీజీ సెంటర్ను తామే తీసుకొచ్చామని తెలిపారు.నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడినని,రాజకీయాల కోసం కాదు. హుజూర్ నగర్ అభివృద్ధి కోసం వచ్చాను. రానున్న రోజుల్లో ఇక్కడే ఉండి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవం కోసం బీజేపీతో కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ అధ్య క్షుడు కొండా హరీష్,పలువురు బిజెపి నాయకులు,పాల్గొన్నారు.






