10 May, 2026 | 4:23 PM

ఫోటో క్యాప్చర్ తో ఇబ్బంది

10-05-2026 03:17 PM

ఫోటో క్యాప్చర్ చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలకు ఫోటో క్యాప్చర్ తో ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఉపాధి పనుల్లో ఇటీవల ఉదయం సాయంత్రం పని ప్రదేశంలో ఫోటో క్యాప్చర్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఫోటో అప్లోడ్ సమయంలో నెట్వర్క్ పనిచేయకున్నా, సర్వర్ బిజీగా ఉన్నా ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన ఫోన్ లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.