మోదీ సభకు పరకాల నియోజకవర్గం నుండి భారీగా తరలిన జనం
10-05-2026 03:13 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు పరకాల నియోజకవర్గం నుండి భారీగా జనం కదిలారు. పరకాల బిజెపి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు ఆధ్వర్యంలో సుమారు 5000 మంది కార్యకర్తలు బస్సుల్లో, కార్లలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమాన్ని కాళీ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయచంద్ర రెడ్డి, డాక్టర్ సంతోష్ కుమార్, బిజెపి జిల్లా నాయకులు కూతురు రాజు, దేవనూరీ మేఘనాథ్,రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.






