ఇరాన్‌ను వదిలే ప్రసక్తే లేదు
అణ్వాయుధాలను పూర్తిగా వదిలేయాలి
అమెరికా ఒప్పందంతో మాకు సంబంధం లేదు
మాకంటూ సొంత ప్రయోజనాలుంటాయి
ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు స్పష్టీకరణ
టెల్‌అవీవ్, జూన్ 16(విజయక్రాంతి): అమెరికా- మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతాన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం అమెరికా చేసుకున్నదని, ఇజ్రాయెల్‌కు సొంత ప్రయోజనాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని తాము ఎప్పటికీ అంగీకరించమని, ఇజ్రాయెల్ ప్రధానిగా తాను ఉన్నంత వరకు అది జరగదని శపథం చేశారు. అప్పటి వరకు ఇరాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందపై ఇజ్రాయెల్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ రక్షణను ఎవరి చేతుల్లోనూ పెట్టేందుకు తాము అంగీకరించబోమని వెల్లడించారు. తాము ఏంసాధిం చామని చాలా మంది ప్రశ్నిస్తున్నారని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్‌లోని అణు శాస్త్ర వేత్తలు, ముఖ్య నాయకులు, మిస్సైల్ నిల్వలపై మునుపెన్నడూ లేనంతగా భీకర దాడులు చేశామని వెల్లడించారు.ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకున్న ఇరాన్ అణుముప్పు నుంచి దేశాన్ని కాపాడుకున్నామని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ చుట్టూ భద్రత
దక్షిణ లెబనాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరణ అంశాన్ని నెతాన్యాహు తోసిపుచ్చారు. దేశ రక్షణలో రాజీపడబోమని, ఇజ్రాయెల్ దేశం చుట్టూ లోతైన భద్రతా వలయాలను (సెక్యూరిటీ జోన్లు) ఏర్పాటు చేశామని చెప్పారు. గాజా, దక్షిణ లెబనాన్, సిరియాలో ఉన్న తమ బలగాలను అవసరమైనంత కాలం కొనసాగిస్తామని ప్రకటించారు. సిరియాలో అసద్ సైన్యానికి చెందిన అన్ని ఆయుధాలను నిర్మూలించామని గుర్తు చేశారు.
ఉగ్రవాద పాలనకు సంబంధించిన అ గ్రనాయకుల తలలను తాము తెగనరికామని నెతన్యాహు వ్యాఖ్యానిం చారు. ఉగ్రవాద కర్మాగారాలను పూ ర్తిగా అణచివేశామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రజలంతా ఒకప్పుడు భయం కరమైన ప్రమాదంలో ఉండేవారని గుర్తు చేశారు. అందుకే తమ దేశ రక్షణ కోసం లెబనాన్ భద్రతా బఫర్ జోన్‌లో అవసరమైనంత కాం తమ సైన్యం ఖచ్చితంగా ఉంటుం దని ఆయన వెల్లడించారు. కాగా నెతాన్యాహు వ్యాఖ్యలతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మరోసారి ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.






