ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం
బీఎల్‌ఏలు అప్రమత్తంగా పనిచేయాలి: ఆత్రం సుగుణ
జైనూర్, జూన్ 16, (విజయ క్రాంతి) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పిలుపునిచ్చారు. జైనూర్ మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేయడంతో పాటు బీఎల్‌ఏలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించి, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బీఎల్‌ఏల బాధ్యతలు, ఓటరు జాబితాల పరిశీలన, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో సర్పంచ్లు కనక ప్రతిభ, మాడవి మనోహర్, తొడసం రాజేందర్, దుర్వ సింధు, ఉయిక చందన్ షా, రాథోడ్ రాందాస్, ఉయిక చందు, పెందోర్ అనుసయా అర్జున్, జాదవ్ జాను బాయి గణపత్, ఆత్రం అయ్యు భుజంగ్ రావ్, ఆత్రం నిర్మల శేష రావ్, గురులే గంగ సాగర్ గుణాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ చిల్లే లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ రసీద్, మెస్రం అంబాజీరావు, ఆత్రం శంకర్ రావు, జల్పత్ రావు తదితరులు పాల్గొన్నారు.






