హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు
హెజ్‌బొల్లా : లెబనాన్ లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు(Israeli Attacks) కొనసాగుతున్నాయి. బీరట్ లోని హెజ్‌బొల్లా కమాండ్ సెంట్రల్ సహా ఆయుధ నిల్వ కేంద్రంపై దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కు చెందిన కమాండర్ అబు హమ్జాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమదేశ సైనికులు, పౌరులపై హమ్జా అనేక ఉగ్రదాడులు చేశాడని ఇజ్రాయెల్ ఆరోపించింది. బీరుట్ శివారులోని ఒక ఛానల్ స్టూడియో భవనంపై క్షిపణి దాడి చేసింది.
ఇజ్రాయెల్(Israeli) దాడుల్లో 52 మంది మరణించారని, 154 మంది గాయపడ్డారని లెబనానల్ ఆరోగ్య శాఖ(Lebanon Health Ministry) ప్రకటించింది. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తాము దాడి చేసినట్లు హెజ్‌బొల్లా(Hezbollah) ప్రకటన చేసింది. దాడులు ఆపకుంటే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్ ను హెజ్‌బొల్లా హెచ్చరించింది.
సౌదీఅరేబియా(Saudi Arabia) రియాద్ లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి(Iran drone attack) చేసింది. రియాద్ లోని అమెరికా ఎంబసీపై(American Embassy) 2 డ్రోన్లు దాడి చేసినట్లు సౌదీ ప్రకటన చేసింది. డ్రోన్ల దాడితో మంటలు చెలరేగి, భవనం స్వల్పంగా దెబ్బతిన్నదని సౌదీ వెల్లడించింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలను(Gulf countries) లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలో అంతకంతకూ యుద్ధ వాతావరణం తీవ్రతరం అవుతోంది.




